News November 20, 2025

గాంధీ ఆస్పత్రికి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు చర్యలు

image

HYD గాంధీ ఆస్పత్రికి కొత్త బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం అధికారులు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను సందర్శించి అక్కడి అధునాతన వైద్య విధానాలను పరిశీలించారు. కార్పొరేట్ స్థాయి సేవలు అందించే విధంగా గాంధీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదిత మోడల్స్‌కు ఆమోదం వచ్చిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభమవుతాయన్నారు.

Similar News

News January 18, 2026

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

image

అత్యధిక వేదికల్లో సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పారు. 35 వేదికల్లో శతకాలు నమోదు చేసి సచిన్(34) రికార్డును బ్రేక్ చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్(26), పాంటింగ్(21) ఉన్నారు. మరోవైపు NZపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గానూ రికార్డులకెక్కారు. కోహ్లీ(10) తర్వాతి స్థానాల్లో కలిస్(9), రూట్(9), సచిన్(9), పాంటింగ్(8), సెహ్వాగ్(8) ఉన్నారు.

News January 18, 2026

విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఎస్‌ఈ రాజేశ్వరి

image

2026-27 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్‌పై ఈ నెల 20 నుంచి 27 వరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు APEPDCL ఎస్‌ఈ రాజేశ్వరి ఆదివారం తెలిపారు. డిస్కంలు సమర్పించిన చార్జీల ప్రతిపాదనలపై ప్రజలు తమ అభిప్రాయాలను అమలాపురం ఎస్‌ఈ కార్యాలయంలో ఆన్ లైన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 18, 2026

వనపర్తి: పుర ఎన్నికల ఆశావహుల్లో నైరాశ్యం

image

పుర ఎన్నికల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల ఆశలు అడియాసలయ్యాయి. గత రిజర్వేషన్లు తారుమారు కావడంతో పతులు తమ సతుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు తమ సతీమణులను పోటీకి దించేందుకు సిద్ధపడగా, మరికొందరు అనుచరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.