News May 22, 2024
గాంధీ హాస్పిటల్ డీప్ ఫేక్ వీడియో X నుంచి తొలగింపు

కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ గాంధీ హాస్పిటల్ పై Xలో పోస్ట్ చేసిన డీప్ ఫేక్ వీడియోను BRS USA ఎక్స్ ఖాతా నిర్వాహకుడు హరీశ్ రెడ్డి తొలగించారు. తనకు తెలియక పొరపాటున పాత వీడియోను పోస్ట్ చేశానని, అపాలజీ చెబుతూ.. మరో వీడియో పెట్టారు. గాంధీ సూపరింటెండెంట్ ఫిర్యాదుతో హరీశ్ రెడ్డిపై చిలకలగూడ PSలో IT, IPC 505 క్లాజ్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు SHO అనుదీప్ తెలిపారు.
Similar News
News March 10, 2026
HYDలో రూ.430 కోట్లతో మరో కేబుల్ బ్రిడ్జ్

HYDలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీనిని 2.65 KMల పొడవు, 22.2 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని NH 44 నుంచి మీర్ ఆలం పార్క్ సమీపంలోని చింతల్మెట్ రోడ్డు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.430 CR మంజూరు చేసింది. MP అసదుద్దీన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.
News March 10, 2026
HYD: మూడు ముక్కలు.. కానీ ‘POWER’ అక్కడే!

గ్రేటర్ HYDను 3 కార్పొరేషన్లు(GHMC, MMC, CMC)గా విభజించారు. అయితే తెలంగాణ మున్సిపల్ చట్టం(సవరణ) 2024 ప్రకారం 10 అంతస్తులపైన కట్టే ‘హై రైజ్’ బిల్డింగుల పర్మిషన్ ఫీజు ఇకపై నేరుగా HMDA ఖాతాలోకి వెళ్తుంది. అంటే కొత్తగా ఏర్పడిన MMC, CMCలకు కేవలం డ్రైనేజీ, చెత్త ఏరడం వంటి ఖర్చులతో కూడిన పనులే మిగిలాయి. ఆదాయం వచ్చే పర్మిషన్ల పవర్ లేకపోవడంతో ఈ సంస్థలు భవిష్యత్తులో జీతాల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి.
News March 10, 2026
REWIND: పోలీసుల కళ్లుగప్పి.. పడవలో ట్యాంక్ బండ్‌కు..!

15ఏళ్ల క్రితం మిలియన్ మార్చ్ వేళ ట్యాంక్ బండ్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఉద్యమాన్ని అడ్డుకోవాలని ఆందోళనకారులు నెక్లెస్ రోడ్డుకు రాకుండా పోలీసులు నలుదిక్కులా మోహరించారు. అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు, అరెస్టులతో నిలువరించారు. దీంతో అప్పట్లో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమనేత హరీశ్‌రావు హుస్సేన్‌సాగర్‌లో పడవలో ప్రయాణించి ట్యాంక్ బండ్‌కు చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.


