News February 10, 2025
గాజువాకలో ఇలా మోసం.. జాగ్రత్త

షార్జాలో వెల్డర్ ఉద్యోగాలంటూ గాజువాకలో ఓ ఏజెన్సీ యాడ్ ఇచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు రూ.3లక్షలు చెల్లించారు. వారికి గాజువాక ఆటోనగర్‌లో వెల్డింగ్ ట్రైనింగ్ ఇచ్చి విజిట్ వీసాపై షార్జా పంపారు. అక్కడ ఏజెంట్ పాస్‌పోర్ట్ లాగేసుకుని వీరికి ఎగ్జాం పెట్టి ఫెయిలయ్యారని హెల్పర్ ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఆ జాబ్ నచ్చని వాళ్లు ఇండియా పంపాలని కోరగా ఏజెంట్ స్పందించలేదు. చివరకు విశాఖ CPసాయంతో తిరిగొచ్చారు.
Similar News
News February 19, 2026
విశాఖలో మహా దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

విశాఖలో దారుణం జరిగింది. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఎర్రవల్లి యోగి(19) మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. చిన్నారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. హార్బర్ ఏసీపీ చిట్టిబాబు పర్యవేక్షణలో న్యూ పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2026
ములుగు: అమిత్ షా డెడ్ లైన్.. ఆపరేషన్ కర్రెగుట్టలు-2

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఆపరేషన్ కర్రెగుట్టలు-2 అనే పేరుతో కేంద్ర బలగాలు అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. మార్చి 31కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో అడవులను జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను కూకటి వేళ్లతో ఏరి వేయడమే లక్ష్యంగా సుమారు 5,000 మంది బలగాలు అణువణువు గాలిస్తున్నాయి.
News February 19, 2026
నిర్మల్: సర్కారు బడుల్లో 21న పీటీఎం

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరి 21న తల్లిదండ్రుల సమావేశాలు (PTM) నిర్వహించాలని డీఈఓ భోజన్న గురువారం ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు భాష, గణిత అంశాల్లో ఇంటి వద్ద ఎలా సహాయం చేయాలో తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులను అధిక సంఖ్యలో ఆహ్వానించి, నిర్ణీత అంశాలపై చర్చించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని కోరారు.


