News April 12, 2024

గాదిగూడలో రూ.4.50 లక్షల గంజాయి పట్టివేత

image

గాదిగూడ మండల పరిధిలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఉమ్మడి నార్నూర్ మండలంలో గత నాలుగు రోజుల్లో దాదాపు 18 కిలోలతో కూడిన సుమారు రూ.4.50 లక్షల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

ఆదిలాబాద్: రేపే పోలింగ్.. ఏకగ్రీవమైన పంచాయతీలు ఇవే

image

ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో 2వ విడత పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, హత్తిగుట్ట, చాంద్ పల్లి, అడ, పూసాయి, మార్కగూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్, పార్డి (బి), జంబుల్ దరి, లింగు గూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.

News December 13, 2025

పోలింగ్‌కు పగడ్బందిగా ఏర్పాట్లు: ఆదిలాబాద్ కలెక్టర్

image

ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సాత్నాల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. తహశీల్దార్ జాదవ్ రామారావు, ఎంపీడీవో వెంకట రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2025

ఆదిలాబాద్: ‘బెదిరింపులకు పాల్పడితే చెప్పండి’

image

తినే పదార్థాలు తయారు చేసే యజమానులు ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత రంగులు వాడకూడదని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సురక్షిత ఆహారం, ఆరోగ్యంపై అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వస్తువులను వినియోగదారులు పరిశీలించి కొనాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమను సంప్రదించాలన్నారు. అధ్యక్షుడు దినేష్ ఉన్నారు.