News April 14, 2024
గిద్దలూరు: రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొనటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గిద్దలూరు పట్టణ సమీపంలో ఎడవల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఖాజావలి (38) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొనటంతో తీవ్ర గాయాలతో ఖాజావలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 12, 2025
ఒంగోలు: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలుశిక్ష

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వఅదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. హెచ్ఎంపాడు మండలానికి చెందిన రవి ఓ యువతిని నమ్మించి మోసం చేసినట్లుగా 2018లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో రవికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
News December 12, 2025
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 12, 2025
ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


