News December 11, 2025

గిద్దలూరు: రాజకీయంలో పిడతల కుటుంబం

image

గిద్దలూరు రాజకీయ ముఖ చిత్రంలో పిడతల కుటుంబం ప్రాధాన్యత అధికం. పిడతల రంగారెడ్డి 1937 నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్‌గా పదవులు చేపట్టారు. 1991లో ఈయన కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో పిడతల రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ రెడ్డి గెలవగా.. 2001లో ఈయన మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈయన సతీమణి సాయికల్పన ఎమ్మెల్యే అయ్యారు.

Similar News

News January 13, 2026

త్రిపురాంతకం హైవేపై రోడ్డు ప్రమాదం.!

image

త్రిపురాంతకం మండలంలోని ముడివేముల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో- బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కూరగాయల ఆటోలో ఉన్న పలువురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సహాయంతో వినుకొండకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 13, 2026

మరోసారి తెరపైకి ప్రకాశం జిల్లా ఎయిర్‌పోర్ట్

image

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామ పరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదించిన భూములను కలెక్టర్ రాజబాబు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఎయిర్ పో‌ర్టు అథారిటీ నుంచి వచ్చిన టెక్నికల్ టీం సభ్యులు ఆయుషి రాయ్‌తో కలిసి కలెక్టర్ భూముల వివరాలను సంబంధిత మ్యాపుల ద్వారా పరిశీలించారు. అనంతరం పలు అంశాలపై ఎయిర్ పో‌ర్టు అథారిటీ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.

News January 13, 2026

విమానాశ్రయం భూములను పరిశీలించిన ప్రకాశం కలెక్టర్