News July 20, 2024

గిరిప్రదక్షిణకు జీవీఎంసీ రూ.1.85 కోట్లు వ్యయం

image

సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం మహా విశాఖ నగరపాలక సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంజినీరింగ్ విభాగం నుంచి రూ.1.69 కోట్లు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.16లక్షలు మొత్తం 1.85కోట్లు వెచ్చిస్తున్నారు. ఇన్ఛార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశాల మేరకు ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కుమార్ ఏర్పాట్లు చేశారు.

Similar News

News December 10, 2024

విశాఖ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

విశాఖలోని స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. <<14841020>>మహిళపై అసభ్యంగా <<>>ప్రవర్తించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

News December 10, 2024

పలు అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ ఆమోదం

image

వీఎంఆర్డీఏ పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసింది.➤  రూ.200 కోట్లతో సముద్రతీరం కోతకు గురి కాకుండా చర్యలు ➤ ఋషికొండ, గంభీరం వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ➤ రుషికొండ వద్ద హ్యాబిటేట్ సెంటర్ ఏర్పాటు ➤ మధురవాడలో ఒలింపిక్ స్టాండర్డ్స్ అనుగుణంగా రూ.3 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు ➤ రూ.9 కోట్లతో 15 ప్రాంతాల్లో రహదారుల  ➤ అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ పనులకు ఆమోదం 

News December 10, 2024

హోం మంత్రి అనితకు హైకోర్టులో ఊరట

image

హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో విశాఖ కోర్టులో ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనిత, ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై రాజీ కుదుర్చుకున్నామని చెప్పడంతో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70లక్షలు అప్పుతీసుకున్న ఆమె 2018లో చెక్కు ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు.