News November 16, 2025

‘గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి’

image

కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం జరిగిన జిల్లా మహాసభలో మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న సూర్యాపేటలో రణభేరిని నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.

Similar News

News January 23, 2026

టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

image

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.

News January 23, 2026

WPL: యూపీపై గుజరాత్ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.

News January 23, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

image

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.