News December 1, 2025
గీసు’కొండ’లో రెండు కాంగ్రెస్‌ల మధ్య పోటీ!

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. కానీ వరంగల్ జిల్లాలో కొండా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మధ్య తీవ్రంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా గీసుగొండలో అధికార పార్టీలో రెండు గ్రూపుల చిచ్చు తీవ్ర స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల్లో గీసుగొండలో బీఆర్ఎస్ సైడ్ అయి, రెండు కాంగ్రెస్‌ల అభ్యర్థుల మధ్యే పోటీ జరుగుతోందని ప్రచారం అవుతోంది.
Similar News
News February 9, 2026
నల్గొండ: 5 గంటల తరువాత అంతా సైలెన్స్

NLG కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల్లో కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
News February 9, 2026
పూజా మందిరంలో దీపం పెడుతున్నారా?

నిత్య దీపారాధనతో ఇంట్లో శుభం కలుగుతుంది. అయితే కొన్ని నియమాలతో మరిన్ని పుణ్యఫలాలు లభిస్తాయి. అవి.. దీపాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదు. తూర్పు వైపు పెడితే ఆరోగ్యం, ఉత్తరం వైపు పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తాయి. శివునికి ఎడమ, విష్ణువుకు కుడి వైపు దీపం ఉంచాలి. ఇందుకు ఆవు నెయ్యి శ్రేష్ఠం. ఒకే వత్తితో దీపం వెలిగించరాదు. కాలిన వత్తితో ఓ పరిహారం పాటిస్తే మంచి జరుగుతుంది. అదేంటో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News February 9, 2026
పెరిగిన ఎండలు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మొదలయ్యాయి. TGలోని ప్రధాన నగరాల్లో నిన్న ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటాయని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీలు, హనుమకొండ, మెదక్, నిజామాబాద్‌లో 32 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొంది. అటు ఏపీలోని కావలిలో నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా రికార్డైంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.


