News February 10, 2025
గీసుగొండలో గంజాయి చాక్లెట్ల కలకలం..

గీసుగొండ మండలంలో గంజాయి చాక్లెట్ల వార్త కలకలం రేపింది. సీఐ మహేందర్ తెలిపిన వివరాలిలా.. టెక్స్‌టైల్ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు యువకుల వద్ద గంజాయి చాక్లెట్లు ఉన్నాయని సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ముగ్గురు యువకులు పారిపోవడానికి యత్నించారు. వారిని వెంబడించి పట్టుకోగా 12 గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. వారిని కస్టడీలోకి తీసుకున్నామని CI తెలిపారు.
Similar News
News March 22, 2025
ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.
News March 22, 2025
బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్‌లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్‌పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
News March 22, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

వరంగల్ జిల్లాలో వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో దుగ్గొండి, ఖానాపురం, ఖిలా వరంగల్ మినహా మిగతా 10 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేసుకునేందుకు ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వడం, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలు ఉత్తమ మార్గం.