News February 11, 2025
గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News March 19, 2025
వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా

YCPకి MLC మర్రి రాజశేఖర్ రాజీనామా చర్చనీయాంశమైంది. 2004లో చిలకలూరిపేటలో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆయన 2010లో YCPలో చేరారు. 2014లో MLAగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం YCP జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2018లో జగన్ పాదయాత్రలో కీలకంగా పనిచేశారు. కాగా 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా విడదల రజనీ ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేదని ఆయన అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
News March 19, 2025
గుంటూరు మేయర్ ఎంపికపై ఉత్కంఠ

కావటి మనోహర్ మేయర్ పదవికి రాజీనామా చేయడంతో గుంటూరులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో తాత్కాలిక మేయర్ రేసులో కోవెలమూడి, కొందరు సీనియర్ కార్పొరేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నవారిని తాత్కాలిక మేయర్‌గా నియమిస్తారు. దీంతో కూటమి తరఫున సజీలను నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె కంటే తానే సీనియర్‌ని అని డైమండ్ బాబు(YCP) అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది.
News March 19, 2025
వట్టిచెరుకూరు: చిన్నారిపై అత్యాచారం.. వృద్ధుడిపై పోక్సో కేసు

బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి ఏడేళ్ళ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడో వృద్ధుడు. వట్టిచెరుకూరు మండలంలో ఈ అమానుషం జరిగింది. సీఐ రామానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కె.థామస్(55) ఇంటి పక్కనే ఉన్న చిన్నారిపై ఈ నెల 14న ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. అనారోగ్యంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వృద్ధుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశామన్నారు.