News April 1, 2024
గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

గుంటూరులో సోమవారం ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురి కావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాత గుంటూరు క్రిస్టియన్ పేటకు చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడి హతమార్చినట్లు పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత దూరం పరిగెత్తినప్పటికీ విడిచిపెట్టకుండా హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
అమరావతిని వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక

అమరావతిని ప్రాంతీయ సమీకృత వృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో విజయవాడ–గుంటూరు–అమరావతి ప్రాంతాన్ని లాజిస్టిక్స్, పరిపాలన, నైపుణ్యాల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాజధానిని అనుసంధానించి టైర్-2 పట్టణ సముదాయంగా రూపుదిద్దుతామని పేర్కొన్నారు. పునర్నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు.
News February 12, 2026
అమరావతిలో మెరీనా ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం

కృష్ణా నది తీరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అమరావతి సమీపంలో భారీ మెరీనా నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. వెంకటపాలెం వద్ద పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో వినోదం, బోటింగ్, క్లబ్ హౌస్‌లు, గెస్ట్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. నదీ తీరాన్ని ఆకర్షణీయంగా మార్చి దేశీయ-విదేశీ పర్యాటకులను రప్పించాలన్నది ఉద్దేశం. టెండర్ ప్రక్రియకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
News February 12, 2026
గుంటూరు–విజయవాడ రైల్వే రద్దీకి చెక్.. కొత్త లైన్లపై కేంద్రం క్లారిటీ

పార్లమెంట్‌లో రైల్వే అభివృద్ధిపై ఎంపీ కృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇచ్చింది. శావల్యాపురం–బాపట్ల కొత్త లైన్‌పై ప్రస్తుతం గుంటూరు, తెనాలి మార్గంలో సౌకర్యం ఉందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గుంటూరు–విజయవాడ రద్దీ తగ్గించేందుకు ఎర్రుపాలెం–అమరావతి–నంబూరు, కోటిపల్లి–నర్సాపురం, గుంటూరు–బీబీనగర్, గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. 4వ లైన్ డీపీఆర్‌కు సర్వేలు మంజూరయ్యాయి.


