News March 12, 2025
గుంటూరు జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్ ఐఎఎస్ అధికారులు కె.కన్నబాబు గుంటూరుకు, వాకాటి కరుణను పల్నాడుకు, కృతిక శుక్లాను బాపట్ల జిల్లాకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 23, 2026
RTC బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

ప్రభుత్వ సేవల పై పాజిటివ్ పర్సెప్షన్ మరింతగా మెరుగుపర్చేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో శుక్రవారం ప్రజారవాణా, రిజిస్ట్రేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీబస్టాండ్‌లో తాగునీరు, పరిశుభ్రత, సీటింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
News January 23, 2026
నేటి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 38,000 బస్తాల సరుకు వచ్చింది. ఇందులో 28,000 బస్తాలు కొత్త పంట కాగా, 10,000 బస్తాలు ఏసీ నిల్వలు ఉన్నాయి. తేజా రకం ధర స్వల్పంగా తగ్గింది. గరిష్టంగా రూ.18,300 పలికినప్పటికీ, సగటున రూ.18,000 వద్దే లావాదేవీలు జరిగాయి. 341, డీడీ రకాలు రూ.24,000 నుండి రూ.24,500 వరకు అమ్ముడుపోయాయి. బ్యాడిగి ఏసీ రకం గరిష్టంగా రూ.30,000 వరకు పలికింది. ఆర్మూర్ రకం రూ.16,500 వద్ద నిలిచింది.
News January 23, 2026
గుంటూరు జిల్లాలో భారీ మోసం

నల్లపాడు GDCC బ్యాంకులో రూ.30కోట్ల పైగా ఆర్థిక మోసానికి పాల్పడిన 2 కేసుల్లో 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు ఛైర్మన్, ఉద్యోగులు, కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్, మిర్చి వ్యాపారులు, నకిలీ రైతులు మొత్తం 270మంది నిందితులుగా గుర్తించామని అన్నారు. బ్యాంక్ మేనేజర్ అరుణకుమారి, కమిటీ సభ్యుడు గోవింద్, మిర్చి వ్యాపారి రామచంద్రరావు, కోల్డ్ స్టోరేజ్ నాగిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి అరెస్టయ్యారు.


