News August 14, 2025

గుంటూరు జిల్లా ప్రజలకు గమనిక

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 0863 2234014 నంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఈ కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు.

Similar News

News March 15, 2026

ANU: సజావుగా దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా జరిగినట్లు CDE వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ANUలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలలో 736 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని 670 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

News March 15, 2026

జిల్లాలో 10 పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు: ఆర్‌జేడీ

image

10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు పరిధిలోని 17 పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి ఆదివారం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News March 15, 2026

సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ వెబ్‌సైట్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు కేవలం ప్రత్యక్షంగానే కాకుండా ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.