News December 20, 2024
గుంటూరు జిల్లా బ్రాండ్ ప్రతిభింబించాలి: కలెక్టర్ నాగలక్ష్మి
పట్టణంలోని శంకర్ విలాస్ సెంటరులో నూతనంగా నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీ నివారణకు అనుగుణంగా, ఐకానిక్ ఆర్కిటెక్చర్ ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పిల్లర్లపై జిల్లా బ్రాండ్‌ను ప్రతిబింబించేలా డిజైన్లు రూపొందించాలని సూచించారు.
Similar News
News January 18, 2025
మంగళగిరి: పవన్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు అయిన మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం సమయంలో కార్యాలయంపై ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దాదాపు 20నిమిషాలు పాటు డ్రోన్ ఎగిరినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. దీంతో ఉలిక్కిపడిన సిబ్బంది వెంటనే డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
News January 18, 2025
NTRకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంతో చర్చలు: లోకేశ్
రాజకీయాల్లోకి వచ్చిన 9నెలల్లో ప్రభంజనం సృష్టించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తలెత్తుకు తిరిగేలా చేశారని కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
News January 18, 2025
గుంటూరులో ఇద్దరు డీఎస్పీలు బదిలీ
గుంటూరు వెస్ట్, సౌత్ డీఎస్పీలు జయరామ్ ప్రసాద్, మల్లికార్జునరావును ప్రభుత్వం బదిలీ చేసింది. గతేడాది బోరుగడ్డ అనిల్ కుమార్ అరండల్‌పేట స్టేషన్‌లో ఉన్నప్పుడు దిండు, దుప్పట్లు ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులను కలిసి రాచమర్యాదలు చేశారనే దానిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇదిలా ఉంటే బదిలీతో ఖాళీ అయిన స్థానాలను భానోదయ, అరవింద్‌తో ప్రభుత్వం భర్తీ చేసింది.