News May 7, 2025
గుంటూరు: నిరాశపరిచిన CSK ఓపెనర్ రషీద్

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్, గుంటూరు మిర్చి షేక్.రషీద్ (0) నేటి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా శుక్రవారం CSK-SRH జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఓపెనర్ బరిలో దిగిన రషీద్ మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు.
Similar News
News February 16, 2026
రాజధానిలో రాత్రి వేళ అందని వైద్యం..!

తుళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రాత్రైతే వైద్యులు ఉండటంలేదని రోగులు అంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులతో పాటు స్థానిక ప్రజలు రాత్రివేళలో వైద్యశాలకు వెళితే సరైన వైద్యం అందించే నాధుడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. రాత్రి సమయంలో ఆరోగ్య కేంద్రం వైద్యానికి దూరంగా ఉంటుందంటున్నారు. సమస్యపై ప్రజా ప్రతినిధులకు ఏ కరువు పెట్టినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
News February 16, 2026
జిల్లాలో 4,71,937 మంది బాలలకు మాత్రలు అందిస్తాం: DMHO

జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 4,71,937 మంది బాలబాలికలకు మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కే విజయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా మాత్రలు అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు తీసుకోవాలని సూచించారు. 17న తీసుకోని వారు 24న మాప్-అప్ రౌండ్‌లో తప్పక తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News February 16, 2026
మంగళగిరి: ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు

ఘాట్ రోడ్‌లో ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కొండ వెనుక ఉన్న ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు చేసినట్లు దేవస్థాన అధికారి సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా మంగళవారం గండాలయ్య స్వామి దర్శనానికి కొండ వెనుక ఘాట్ రోడ్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామన్నారు. కొండపై ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.


