News March 27, 2024
గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా అజయ్

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గుంటూరులోని CPI కార్యాలయంలో కూటమి సభ్యులు సమావేశం నిర్వహించి అజయ్ కుమార్‌ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మిక, రైతు, పేద, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Similar News
News February 17, 2026
GNT: అసెంబ్లీలో విద్యార్థుల సందడి

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.
News February 17, 2026
వేసవిలో నీటిసమస్య తలెత్తకుండా చూడాలి: కలెక్టర్

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా నీరు, పారిశుద్ద్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ వారీగా నిధుల లభ్యత నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బోరు బావులు మరమ్మతులు 24 గంటల్లో పూర్తి చేయుటకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచాలన్నారు.
News February 17, 2026
గుంటూరులో CBSE టెన్త్ పరీక్షలు షురూ

గుంటూరు జిల్లాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.


