News April 26, 2024
గుంటూరు పార్లమెంట్ పోటీలో 34 మంది: ఆర్వో

గుంటూరు పార్లమెంటు స్థానానికి 47 మంది అభ్యర్థులు 67 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం గుంటూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డి నామినేషన్‌ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 34 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించి, సక్రమంగా లేని 13 నామినేషన్లను రిజెక్ట్ చేశామన్నారు. పరిశీలనలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు S.P. కార్తీకా పాల్గొన్నారు.
Similar News
News April 15, 2026
టీడీపీ రాష్ట్ర కమిటీలో గుంటూరు నేతలకు ప్రాధాన్యం

టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోగా నియమించారు. తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్, తాడిశెట్టి మురళి సహా పలువురికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు కల్పించారు.

ఇంటర్ ఫలితాల్లో సత్తా గుంటూరు జిల్లా స్టూడెంట్స్

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 30,551 మంది పరీక్షలు రాయగా 26,856 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది.