News September 11, 2025
గుంటూరు మెడికల్ కాలేజ్ సూచన

పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీ వరకు గడవును పొడిగించామని గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి తెలిపారు. గతంలో ప్రకటించిన 16వ తేదీ కౌన్సెలింగ్‌ని రద్దు చేశామని చెప్పారు. అక్టోబర్ 9వ తేదీ వరకు కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను apsahpc.co.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News December 15, 2025
నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారు. మేయర్ తన ప్రతినిధి ద్వారా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. 18న కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరపనున్నారు.
News December 15, 2025
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News December 15, 2025
NTR: ఆలయ సేవలు ఇక వాట్సాప్‌లో

ఆలయాలకు సంబంధించిన సేవలను సైతం వాట్సాప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వాట్సాప్‌లో 9552300009కి hi అని మెసేజ్ పంపి.. దర్శన్ టికెట్లు, ప్రత్యేక పూజలు, రూమ్స్ బుకింగ్ వంటి పలు రకాల టికెట్లను నేరుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయంతో పాటు, మరో 21 ఆలయాల్లో ఈ సదుపాయం కల్పించారు.


