News September 12, 2024
గుంటూరు: యానిమేటర్స్ ధర్నా కేసును కొట్టేసిన కోర్టు
సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలని యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం 2018లో గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం యూనియన్ నాయకులపై మోపిన అభియోగాలు రుజువు చేయలేకపోవడంతో స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు జడ్జ్) కేసును ఇవాళ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News October 5, 2024
తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తా: పెమ్మసాని
తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-2047 యాక్షన్ ప్లాన్, తెనాలి పట్టణ అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి చేయాల్సిన పనుల గురించి అధికారులతో చర్చించారు.
News October 5, 2024
గుంటూరు: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.
News October 5, 2024
పట్టభద్రులు ఓటర్లుగా దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టభద్రులందరూ ఓటర్లగా నమోదు చేసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. శుక్రవారం, కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గములో ఓటర్ల నమోదుకు అర్హులైన వారు www.ceoandhra.nic.in వెబ్ సైటు ద్వారా ఫారం- 18 సమర్పించాలన్నారు. నవంబరు 23, 2024 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని చెప్పారు.