News March 31, 2024

గుంటూరు: ‘లైసెన్స్ గన్స్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి’

image

ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే యజమానులు తమ లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం. వేణుగోపాల్ రెడ్డి తెలియజేశారు. శనివారం జిల్లా ఎస్పీ తుషార్ దూడీతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి లైసెన్స్ గన్స్ అప్పగించడంపై సమావేశం నిర్వహించారు. సరెండర్ చేసిన తుపాకులు ఎన్నికలు ముగిసిన తరువాత సంబంధిత లెటర్‌ చూపించి తీసుకు వెళ్లవచ్చన్నారు.

Similar News

News February 13, 2026

GNT: రాజధాని రైతులకు ముఖ్య గమనిక

image

రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” శనివారం అనగా ఫిబ్రవరి 14న రద్దు చేస్తున్నట్లు CRDA అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్వహణ కారణాల రీత్యా రేపు గ్రీవెన్స్ డే జరగదని, రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News February 13, 2026

GNT: అధ్యాపకుల గైర్హాజరు.. నోటీసులకు కలెక్టర్ ఆదేశాలు

image

చేబ్రోలు డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల పరిసరాలు పరిశుభ్రత అధ్వానంగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకుల హాజరు పట్టిక పరిశీలించిన కలెక్టర్ పలువురు గైర్హాజరు పట్ల ప్రశ్నించారు. మూమెంట్ రిజిస్టర్ పరిశీలించి అందులో ఎటువంటి అనుమతులు నమోదు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హారైన అధ్యాపకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు.

News February 13, 2026

GNT: జెడ్పీటీసీ విభజనపై కసరత్తు

image

ఉమ్మడి గుంటూరు జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాల పునర్విభజనపై ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. పల్నాడులో 28 జెడ్పీటీసీలు ఉండగా, గుంటూరు, బాపట్లలో కూడా విభజన పనులు కొనసాగుతున్నాయి. 3 జిల్లా పరిషత్‌లు ఏర్పడే అవకాశంతో ఛైర్మన్ పదవులపై నేతలు దృష్టి పెట్టారు. గతంలో ఎన్నికలు జరగని పంచాయతీలలో ఓటర్ల జాబితాలలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.