News May 15, 2024
గుంటూరు-విశాఖ, రాజమండ్రి – విశాఖ మధ్య రెండు రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్ పరిధిలో భద్రత దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ తెలిపారు. గుంటూరు- విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15 నుంచి 26 వరకు, విశాఖ- గుంటూరు మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు, రాజమండ్రి – విశాఖ- రాజమండ్రి మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News December 12, 2025
విశాఖ: సోలార్ ప్రాజెక్టులపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష

APEPDCL పరిధిలోని 11 జిల్లాలు ఫీడర్ లెవెల్ సోలర్రైజేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉండాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశించారు. ఛైర్మన్‌తో పాటు కలెక్టర్లు, ముఖ్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. SC, ST గృహాలపై 400 MW రూఫ్ టాప్ సోలార్ పనులు మార్చిలోపు పూర్తి చేయాలని, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని సూచించారు. 35,676 గృహాలపై 114 మెగావాట్ల రూఫ్ టాప్ ఏర్పాటు చేసినట్లు ఛైర్మన్ పృథ్వి తేజ తెలిపారు.
News December 12, 2025
రోలర్ స్కేటింగ్‌లో విశాఖ క్రీడాకారిణికి గోల్డ్ మెడల్

విశాఖలో 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో నగరానికి చెందిన క్రీడాకారిణి శ్రీ సాహితి బంగారు పతకం సాధించింది. ఈ పతకంతో శ్రీ సాహితి ఇప్పటివరకు106 పతకాలు సాధించినట్లు కోచ్ ఆకుల పవన్ కుమార్ వెల్లడించారు. VMRDA శాప్ అందించిన ప్రోత్సాహం విజయానికి దోహదపడ్డాయని శ్రీ సాహితి తెలిపింది.
News December 12, 2025
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్‌లో 19 ఫిర్యాదులు

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమంలో 19 వినతులు వచ్చాయని చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సీపీలు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ చెప్పారు.


