News August 22, 2025
గుంటూరు: DSC మెరిట్ లిస్టుపై ఉత్కంఠ

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, నేడు విడుదల కానున్న మెరిట్ జాబితాపై ఉత్కంఠ నెలకొంది. జూన్-జులైలో పరీక్షలు నిర్వహించిన తర్వాత, మార్కులు విడుదల కావడానికి 40 రోజులకు పైగా సమయం పట్టింది. ముఖ్యంగా బోర్డర్ మార్కులు సాధించిన వారు ఉద్యోగం వస్తుందా లేదా అని ఊపిరి బిగబట్టారు. గుంటూరు జిల్లాలో ఎస్జీటి, స్కూల్ అసిస్టెంట్ అన్ని కలిపి 1143 పోస్టులకు దాదాపు 25 వేల మంది పరీక్షలు రాశారు.
Similar News
News January 18, 2026
మన మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న పంట

మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఈ యాసంగి సీజన్‌లో రైతులు మొక్కజొన్న పంటను శాస్త్రీయ వంగడాలతో సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ సీజన్‌లో సుమారు 78 ఎకరాలలో శాస్త్రవేత్తలు సూచించిన నూతన వంగడాల సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అధిక దిగుబడి సాధించినట్లయితే, వివిధ రకాల శాస్త్రీయ వంగడాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపనున్నారు.
News January 18, 2026
రథసప్తమి వేడుకల పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే

ఈనెల 19 నుంచి 23వరకు జరగనున్న రథసప్తమి వేడుకల షెడ్యూల్ సంబంధిత అధికారులు ఆదివారం ప్రకటించారు. ఆ మూడు రోజులు హెలిప్యాడ్ రైడింగ్ ఉదయం 9-సాయంత్రం 5 వరకు ఉంటుంది. NTR మున్సిపల్ హైస్కూల్లో వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతాయి. KR స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్ కిడ్స్ ప్లే జరుగుతుందన్నారు. 22న 80 ఫీట్ రోడ్డులో 7 గంటల-మెగాసూర్య నమస్కారాలు, సాయంత్రం 5 గంటల నుంచి భక్తి హాస్యపు జల్లులు 23న శోభా యాత్ర ఉంటుంది.
News January 18, 2026
బధిరుల క్రీడల్లో ‘పశ్చిమ’ ప్రభంజనం.. జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం

హర్యానాలో జరిగిన రాష్ట్రస్థాయి బధిరుల క్రీడా పోటీల్లో ప.గో. జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించారని అసోసియేషన్ గౌరవాధ్యక్షులు చెరుకువాడ రంగసాయి తెలిపారు. తొమ్మిది రాష్ట్రాల నుంచి 600 మంది పాల్గొన్న ఈపోటీల్లో, జిల్లా నుంచి వెళ్లిన 16 మంది ప్రతిభ కనబరిచారన్నారు. విజేతలను ఆదివారం భీమవరంలో ఘనంగా అభినందించారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో రాణించడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.


