News February 15, 2025

గుంటూరు GGHలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ టెక్నీషియన్లుగా శిక్షణ పొందుతున్న విద్యార్థినులపై బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణ ఆసుపత్రిలో కలకలం రేపింది. ఈ మేరకు బాధిత విద్యార్థినులు వారి ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక వేధింపుల ఘటన పై విచారణ చేపట్టాలని ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రిన్సిపాల్ ఏర్పాటు చేశారు.

Similar News

News April 13, 2026

GNT: అక్రమ విద్యుత్.. రూ.12.93 లక్షల ఫైన్

image

విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగం సంయుక్తంగా సోమవారం విద్యుత్ సర్వీసుల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాయి. D13 సెక్షన్ పరిధిలోని ఆటోనగర్, నవభారత్ నగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. 54 మంది అధికారులు, 158 మంది సిబ్బంది, 54 బృందాలుగా ఏర్పడి 4,489 సర్వీసులను తనిఖీ చేశారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా ఉన్న 190 సర్వీసులపై రూ.12.93లక్షల అపరాధ రుసుం విధించారు.

News April 13, 2026

అమరావతి ORRకు 19 ఇంటర్‌ చేంజ్‌లు

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్లానింగ్ పూర్తయింది. 190 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ మార్గంలో యాక్సెస్ కంట్రోల్ కఠినంగా ఉంటుంది. వాహనాలు ఈ రోడ్డుపైకి రావడానికి, బయటకు వెళ్లడానికి కేవలం 19 చోట్ల మాత్రమే ఇంటర్‌ చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. నందివెలుగు, తెనాలి స్పర్ రోడ్, నారాకోడూరు, పుల్లడిగుంట, లింగాయపాలెం, మేడికొండూరు, కాజ తదితర 19 ప్రాంతాల్లో మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉండనున్నాయి.

News April 13, 2026

PGRS ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి: SP

image

పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు డీపీవోలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి వకుల్ జిందాల్ ప్రజల ఫిర్యాదులను తెలుసుకొని వినతీ పత్రాలు స్వీకరించారు. మొత్తం 178 ఫిర్యాదులు అందాయని అన్నారు. నిర్ణీత గడువు లోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఈ సందర్బంగా ఎస్పీ ఆదేశించారు.