News August 12, 2025
గుడికి వెళుతూ.. ఇద్దరు స్పాట్ డెడ్

GD నెల్లూరు(M) పళ్లిపట్టు సమీపంలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబం తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కుబడుల కోసం కారులో బయలుదేరారు. వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
చిత్తూరు జిల్లాకు రూ.115 కోట్ల మంజూరు

చిత్తూరు జిల్లాలో 2.05 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవకు సంబంధించి రూ.115 కోట్లు జమ కానున్నాయి. చిత్తూరులో 11,321 మంది రైతులకు రూ.6.32 కోట్లు, పూతలపట్టులో33,881- రూ.19.27 కోట్లు, పలమనేరు-38,368- రూ.21.71 కోట్లు, కుప్పం- 36,673- రూ.19.80 కోట్లు, పుంగనూరు- 37,191- రూ. 21.23 కోట్లు, నగరి- 12,472- రూ.7.06 కోట్లు, జీడీ నెల్లూరులో 36,047 మందికి రూ.20.43 కోట్లు మంజూరయ్యాయి.
News March 13, 2026
చిత్తూరు: పది పరీక్షలు.. 1210మంది ఇన్విజిలేటర్లు

టెన్త్ పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1210 మంది టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేసినట్లు చిత్తూరు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరంతా ఈనెల 16, 18, 21, 31, మే ఒకటో తేది పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి 10KM పరిధిలోనే ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశామని చెప్పారు. ఎమర్జెన్సీ, గర్భిణులు, నిబంధనల ప్రకారం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులు నిర్వహించ లేనివారు తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
News March 13, 2026
చిత్తూరు జిల్లాలో డబ్బుల వసూలు.. అసలు నిజం ఇదే!

చిత్తూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షల వేళ డబ్బులు ఇస్తే పాస్ చేస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై DEO రాజేంద్ర ప్రసాద్ విచారణ చేపట్టారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఫేర్వెల్ డేకు నగదు తీసుకున్నారని చెప్పారు. ఈ డబ్బులే పరీక్షల్లో పాస్ చేయడానికి అని ప్రచారం చేయడం సరికాదన్నారు. చట్ట విరుద్ధ చర్యలకు చేపడితే కఠిన చర్యలు తప్పవని DEO హెచ్చరించారు.


