News September 13, 2025

గుడిమల్లంలో 22 నుంచి దసరా ఉత్సవాలు

image

పురాతన శైవక్షేత్రమైన గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 22న కలశ పూజ, 23న బాలాత్రిపుర సుందరి, 24న గాయత్రిదేవి, 25న అన్నపూర్ణ దేవి, 26న ఆనందవల్లి, 27న మహాలక్ష్మి దేవి, 28న లలితా త్రిపుర సుందరీ దేవి, 29న సరస్వతి దేవి, 30న దుర్గాదేవి, 1న మహిషాసుర మర్దిని, 2న రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనం ఉంటుంది.

Similar News

News December 6, 2025

‘రహదారి భద్రతా, డిఫెన్సివ్ డ్రైవింగ్’పై శిక్షణ

image

అమరావతి ఇంటిగ్రేటెడ్ అర‍్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (AIUDP) అమలు కార్యకలాపాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన కోసం APCRDA కార్యాలయంలో కాంట్రాక్టర్స్ సిబ్బందికి “రహదారి భద్రతా & డిఫెన్సివ్ డ్రైవింగ్”పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రమాదాలకు గురయ్యే వారి రక్షణ ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు పాటించాల్సిన విధానాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.

News December 6, 2025

HYD: మహా GHMC‌లో 250 డివిజన్లు.!

image

గ్రేటర్‌లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్‌ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్‌లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్‌లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.

News December 6, 2025

కృష్ణా: నకిలీ సిమ్‌లు.. మరో 8 మందికి సంకెళ్లు

image

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్‌ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.