News February 5, 2025
గుడిహత్నూర్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.
Similar News
News February 10, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 10, 2025
ADB: జిల్లాలో MPTC, ZPTC స్థానాలు ఇవే!

ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ, సర్పంచ్ 473, వార్డులు 3,834 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది. కాగా ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
News February 10, 2025
ఇండియన్ ఐడిల్‌లో ADB జిల్లా యువతి ప్రతిభ

ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు. దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.