News September 1, 2024
గుత్తిలో కరెంట్ షాక్‌తో టీడీపీ నేత భార్య మృతి
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, గుత్తి చెరువు ఆయకట్టు మాజీ ఛైర్మన్ కేశవ నాయుడు సతీమణి సుజాతమ్మకు ఆదివారం ఉదయం ఇంట్లో కరెంట్ షాక్ కొట్టింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. సుజాతమ్మ మృతదేహానికి టీడీపీ నాయకులు నివాళులర్పించారు.
Similar News
News September 14, 2024
హిందూపురంలో CM చిత్రపటానికి పోలీసుల క్షీరాభిషేకం
హిందూపురం పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటానికి శనివారం ఎక్సైజ్ పోలీసులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు కమలాకర్, రాంప్రసాద్‌లు మాట్లాడుతూ.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖను విలీనం చేస్తూ ఎక్సైజ్ శాఖను పునరుద్ధరణ చేయడం ఎంతో అభినందనీయమన్నారు.
News September 14, 2024
అనంతపురం జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరా బంద్
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తాగునీటి కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతం చేశారు. 63 పంప్ హౌస్‌లలో నుంచి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కార్మికులు ఇవాళ ప్రకటించారు. సత్య సాయి తాగునీటి పథకాన్ని 19 విభాగాలుగా విభజించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని కార్మికులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
News September 14, 2024
అనంత: ప్రభుత్వ లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ అంత్యక్రియలు
బుక్కపట్నం మండలంలోని గరుగు తాండ గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్ర నాయక్ శుక్రవారం విజయవాడలో గుండెపోటుతో మృతి చెందాడు. శనివారం జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశాలతో ప్రభుత్వా లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.