News March 27, 2024
గుమ్మడిదల: మహిళ హత్య.. దొంగ స్వామీజీ అరెస్టు

పూజలు చేస్తామని నమ్మించి మహిళను హత్య చేసిన దొంగ స్వామీజీని అరెస్టు చేసినట్లు జిన్నారం సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొంతపల్లికి చెందిన బుచ్చమ్మ(60)ను పూజలు చేసే మంచి జరుగుతుందని దొంగ స్వామీజీ శివ నమ్మించాడు. ఫిబ్రవరి 13న హత్య చేసి 4.3 తులాల బంగారం దొంగిలించాడు. పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
Similar News
News February 13, 2026
మెదక్ జిల్లాలో కౌంటింగ్ ప్రశాంతం: కలెక్టర్

మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్‌తో కలిసి కౌంటింగ్‌ను పర్యవేక్షించారు. సమన్వయంతో పనిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.
News February 13, 2026
తూప్రాన్: సమంగా ఓట్లు.. డ్రా

తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ మరో విజయం నమోదైంది. మున్సిపాలిటీలోని 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సత్య లింగం, స్వతంత్ర అభ్యర్థి కృష్ణ పై గెలుపొందారు. ఇరువురికి సమంగా 330 ఓట్లు రాగా, డ్రా నిర్వహించారు. డ్రాలో సత్య లింగం గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.
News February 13, 2026
మెదక్: ఒక్క ఓటుతో గెలుపు

మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన కే.హరిత కేవలం ఒక ఓటుతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రావుపై విజయం సాధించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


