News September 11, 2025
గురుకులాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.
Similar News
News December 11, 2025
కామారెడ్డి జిల్లాలో 5 ఓట్ల తేడాతో తొలి విజయం

బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భాగ్యమ్మ విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి లక్ష్మీపై ఐదు ఓట్ల తేడాతో భాగ్యమ్మ విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచారం కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.
News December 11, 2025
కామారెడ్డి జిల్లాలో ముగిసిన మొదటి విడత పోలింగ్

కామారెడ్డి జిల్లాలో జరిగిన మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పంచాయతీ అధికారి మురళి వెల్లడించారు. కామారెడ్డి, రాజంపేట, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, సదాశివనగర్, తాడ్వాయి, మాచారెడ్డి, పల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఎలాంటి సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు తెలిపారు.
News December 11, 2025
నిర్మల్: ‘ఎన్నికల విధులకు తప్పకుండా హాజరు కావాలి’

జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు కేటాయించబడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. విధులకు హాజరు కానీ ఉద్యోగులపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె సూచించారు. మొదటి విడతలో విధులకు హాజరు కాని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు.


