News October 4, 2025
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఆలమూరు మండలంలోని మూలస్థానం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆలమూరు ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల మేరకు.. రావులపాలెం శివారు తోకలంకకు చెందిన గుత్తులు విజయరాజు (30)ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News January 17, 2026
సిరిసిల్ల: ఎన్నికల ఖర్చుపై కార్యదర్శుల్లో ఆందోళన

గత పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్లు ప్రారంభం నుంచి ఎన్నికల అధికారులు, సిబ్బందికి అల్పాహారం, భోజనాలు, టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లాలో ఒక్కో కార్యదర్శి రూ.30 వేల పైగా ఖర్చు చేశారు. GPని బట్టి రూ.6-8 వేల వరకు ఖర్చులు అందించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలరోజులు గడిచినా ఖర్చులకు లెక్కలు అడగకపోవడంపై కార్యదర్శుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
News January 17, 2026
కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్ ఆహారాలు, తగిన నిద్ర, నీరు తీసుకోవడం, సన్ స్క్రీన్ ఎక్కువగా వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.
News January 17, 2026
శ్రీనివాసుడికి శనివారం ఎందుకు ప్రీతికరమైనది?

వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరమైన రోజు. ఓంకారం ప్రభవించిన, స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న, ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా శనివారమే. తన భక్తులను పీడించనని శనిదేవుడు శ్రీనివాసుడికి మాట ఇచ్చింది కూడా ఈ రోజే. అందుకే 7 శనివారాలు నియమంతో స్వామిని పూజించి, 7 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. స్వామివారికి శనివారంతో ఉన్న ఈ అనుబంధం వల్లే భక్తులు శనివారాలు ఉపవాసాలు ఉంటారు.


