News April 27, 2024

గుర్రం ఎక్కి చింతమనేని ప్రచారం

image

పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో శనివారం దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు ఏర్పాటు చేసిన గుర్రం ఎక్కి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలకు తెలియజేశారు.

Similar News

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

News April 16, 2026

ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

image

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.