News March 6, 2025
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కడప-రాయచోటి హైవేపై గల గువ్వలచెరువు ఘాట్‌లో బుధవారం జరగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారును తప్పించబోయి లారీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏలూరుకు చెందిన లారీ డ్రైవర్ సాంబయ్య (48), నరసరావుపేటకు చెందిన క్లీనర్ నాగరాజు(50) అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ప్రయాణిస్తున్న చక్రాయపేట మండలానికి చెందిన వివేకానందరెడ్డి(43కి) తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 17, 2025
SRCL: లక్ష్మీనరసింహస్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర అందజేత

సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌కు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
News December 17, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 17, 2025
GDK: ధనుర్మాసంలో పంచరామాలకు ప్రత్యేక బస్సు

GDK నుంచి పంచరామాలకు 4 రోజుల యాత్ర ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో పంచారామాలతో పాటు అన్నవరం, సింహాచలం, RK బీచ్, విజయవాడ, అమరావతి దర్శనాలు ఉంటాయి. ఈ యాత్ర DEC 25న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఒక్కరికి ఛార్జీ రూ.4200గా ఉంటుందని DM నాగభూషణం తెలిపారు. భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని, టికెట్ బుకింగ్స్, మరిన్ని వివరాలకు 7382847596, 7013504982 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


