News November 8, 2025

గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

image

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.

Similar News

News January 24, 2026

సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జీల నియామకం

image

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్‌ఛార్జీలను బీఆర్ఎస్ అధిష్ఠానం శనివారం నియమించింది. గజ్వేల్‌కు రాధాకృష్ణ శర్మ, దుబ్బాకకు గుండు భూపేష్, హుస్నాబాద్‌కు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, చేర్యాలకు ఎల్లు రవిందర్ రెడ్డిను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ, అభ్యర్థుల ఎంపికలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.

News January 24, 2026

HYD: రేపు లుంబినీ పార్కు వద్ద సందడి!

image

హైదరాబాద్‌ గగనతలం దేశభక్తి గీతాలతో ప్రతిధ్వనించనుంది. గణతంత్ర వేడుకలు, వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్టిలరీ సెంటర్ ఆధ్వర్యంలో రేపు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు లుంబినీ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద భారీ ‘మిలిటరీ బ్యాండ్’ ప్రదర్శన జరగనుంది. సైనికుల క్రమశిక్షణ, సంగీత విన్యాసాల కలబోతగా సాగే ఈ వేడుక నగరవాసులకు కనువిందు చేయనుంది.

News January 24, 2026

విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

image

విశాఖ-టాటానగర్-విశాఖ (20816/15) వీక్లీ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ స్టేషన్‌ను టాటానగర్ నుంచి ఆదిత్యపూర్‌కు మారుస్తూ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమలులోకి వస్తుంది. రైలు సమయాల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఆదిత్యపూర్ నుంచి ఉదయం 7.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139 నంబర్‌ను సంప్రదించవచ్చు.