News April 1, 2024
గూడూరు: టీచర్ మృతి

రైలు కిందపడి టీచర్ మృతిచెందిన ఘటన గూడూరులో వెలుగు చూసింది. గూడూరు మండలం వెందోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మ్యాథ్స్ టీచర్ కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం గూడూరు రైల్వే స్టేషన్‌లో చెన్నై మెమూ రైలు దిగుతుండగా ప్రమాదశావత్తు జారిపడిపోయారు. రైలు కింద పడిపోవడంతో చనిపోయారని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 7, 2026
నెల్లూరు: అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు..!

నెల్లూరు జిల్లాలో చాలామందికి చట్టం అంటే భయం లేకుండా పోయింది. కావలిలో ఆస్తి కోసం సొంత వారే రైల్వే ఉద్యోగి <<19066737>>నాగరాజును <<>>హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. నవాబుపేటలో మహిళ <<19072747>>హత్య<<>>, సైదాపురంలో అన్నదమ్ముల మధ్య రక్తపాతం జిల్లాను ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు రాత్రి వేళ గస్తీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా.. వరుస హత్యలు ఆగడం లేదు. నేరస్థులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News February 7, 2026
నెల్లూరు: ఆ ఊరిలో అలా చేస్తే రూ.10వేల ఫైన్

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం గ్రామస్థుల నిర్ణయం వైరల్ అవుతోంది. గ్రామంలో అన్యమత ప్రచారం చేస్తే రూ.10వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. ‘గ్రామంలో ఉండేది అంతా హిందువులే. గ్రామంలో అన్య మత ప్రచారం చట్ట విరుద్ధం. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. ఎవరైనా మతం మీద అభిమానం ఉంటే బయటకు వెళ్లి చేసుకోండి’ అంటూ ఓ బోర్డు ఏర్పాటు చేశారు.
News February 7, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం

కోవూరులో ఇటీవల అపహరణకు గురైన బాలిక చెన్నైలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అంగడికి వెళ్తున్న బాలికను ఇద్దరు మైనర్లు బైకుపై ఎక్కించుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లారు. గుర్తు తెలియని ద్రవం తాగించడంతో బాలిక కోమాలోకి వెళ్లింది. అక్కడి నుంచి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాలికను తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయింది. మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.


