News October 6, 2025

గూడూరు: రాత్రయితే బస్సుల కోసం పడిగాపులే

image

నెల్లూరు – తిరుపతి మధ్యలో రాత్రయితే బస్సుల కోసం పడిగాపులు తప్పడం లేదు. ఈ మార్గంలో నెల్లూరు బస్టాండ్లోనే బస్సులు నిండిపోవడంతో గూడూరు బస్టాండ్‌కు వెళ్లకుండానే నేరుగా తిరుపతికి వెళ్లిపోతున్నాయి. దీంతో గూడూరు బస్టాండ్‌కు బస్సులు రాకపోవడంతో బైపాస్‌లో అర్థ రాత్రయినా బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ అధికారులు ఈ పరిస్థితిని గమనించి ఈ సమయంలో సర్వీస్‌లను పెంచాలని కోరుతున్నారు.

Similar News

News January 14, 2026

ఉదయగిరి: హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

ఉదయగిరి (M) దాసరపల్లి – ఉదయగిరి 167 BG జాతీయ రహదారి మధ్యలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. దాసరపల్లికి చెందిన సయ్యద్ సాహెరా తన కుమారుడు మజాహర్ బైక్‌పై ఉదయగిరికి వస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సాహెరా అక్కడికక్కడే మృతిచెందగా మజాహర్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

News January 14, 2026

నెల్లూరు జిల్లాలో 1216 టీచర్ పోస్టులు ఖాళీ

image

నెల్లూరు జిల్లాలో 1,216 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. SA పోస్టులను 70 శాతం ప్రమోషన్స్‌‌తో, 30 శాతం DSCతో భర్తీ చేస్తారు. SAలు తెలుగు(54), సంస్కృతం(3), ఉర్దూ(22), హిందీ(35), ఆంగ్లం(44), MATHS(40), PS(22), BS(47), SS(64), PET(27), స్పెషల్ ఎడ్యుకేషన్(20) ఖాళీలు ఉన్నాయి. SGT కింద 786 పోస్టులు ఉండగా వీటిని DSC-2026లో భర్తీ చేసే అవకాశం ఉందని DEO బాలాజీ రావు వెల్లడించారు.

News January 14, 2026

నెల్లూరు: కయ్యానికి.. కొకొరోకో..!

image

సంక్రాంతి అంటే.. సరదా. కానీ సరదా మాటున ‘కోడి’ పందేలు నిర్వహించడం, వేలకు వేలు ఖర్చు చేయడం, కోళ్లను హింసించడం జరుగుతోంది. జిల్లాలో తీర ప్రాంత మండలాలైన కావలి, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, పెన్నా పరివాహకం పొట్టేపాలెం, కోవూరు వంటి ప్రాంతాల్లో కోడి పందేలు జరిగే అవకాశం ఉంది. విడవలూరు (M) రామతీర్ధం, పట్టపు పాలెం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతాయిని సమాచారం.