News October 7, 2025

గూడూరు: వైన్ షాపులకు దరఖాస్తు స్వీకరణ: ఎక్సైజ్ CI

image

గూడూరు ఎక్సైజ్ పరిధిలోని 12 షాపులకు 2025-27 మద్యం పాలసీలో భాగంగా మంగళవారం ఒక దరఖాస్తు స్వీకరించినట్లు CI బిక్షపతి తెలిపారు. గూడూరు 2, గంగారం 2, కొత్తగూడ 2, కేసముద్రంలో 1 (ST), కేసముద్రం1, ఇనుగుర్తి 1 (SC), కేసముద్రం2, గుండెంగ 1 షాపులను (జనరల్)గా కేటాయించినట్లు CI పేర్కొన్నారు. వీటికి సంబంధించి మహబూబాబాద్ IDOCలో దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.

Similar News

News January 23, 2026

బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

image

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.

News January 23, 2026

ప.గో: వైద్య శాఖ అభ్యంతరాలకు దరఖాస్తులు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వైద్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మవద్దని డీఎంహెచ్వో అమృతం గురువారం స్పష్టం చేశారు. Pharmacist (Contract Basis) టెంటేటివ్ మెరిట్ లిస్టు https://westgodavari.ap.gov.in/ వెబ్ సైట్‌లలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 24వ తేదీ 5 గంటలలోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అందించాలని సూచించారు.

News January 23, 2026

MHBD: సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై నాయకుల కసరత్తు..!

image

మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. వార్డుల్లో పట్టున్న నేతల కోసం బీఆర్ఎస్ సైతం సర్వేలు చేస్తున్నారు.