News September 12, 2025
గూడూరు CHCని తనిఖీ చేసిన కలెక్టర్

గూడూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
Similar News
News December 13, 2025
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు: పెమ్మసాని

మహిళల్లో మౌనం బలహీనతగా మారిపోకూడదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, డీఆర్‌డీఏ సౌజన్యంతో తుళ్లూరులో శనివారం నిర్వహించిన ‘లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం’ నయీ చేతన 4.0లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
News December 13, 2025
మరో ఘటన.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

AP: సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాంవలి కాలనీలో కుక్క స్వైర విహారం చేసింది. వీధిలోని ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికిపైగా తెగిపోయింది. బాబుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై <<18545957>>కుక్క దాడి<<>> చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.
News December 13, 2025
MBNR: రెండో విడత.. ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

MBNR జిల్లాలోని 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 151 గ్రామాలు, 255 పోలింగ్ కేంద్రాలు, 1334 పోలింగ్ స్టేషన్లు, 36 సమస్యాత్మక గ్రామాలలో 42 లొకేషన్లు 355 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎస్పీ డి.జానకి అన్నారు. రూట్ మొబైల్స్-49, FST-16, స్ట్రైకింగ్ ఫోర్సులు-5, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు- 5 ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేశామన్నారు.


