News March 13, 2025

గృహనిర్మాణ దారులకు అదనపు సహాయం: కలెక్టర్ 

image

జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయు నిమిత్తం 10,767 మంది లబ్ధిదారులకు రూ. 6.53 లక్షలు అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలు సమీక్షించారు. అసంపూర్తిగా ఉన్న గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం అదనపు సహాయం అందజేస్తుందన్నారు.

Similar News

News February 9, 2026

విత్తన పొట్టేలుకు ఉండాల్సిన లక్షణాలు

image

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.

News February 9, 2026

దీపారాధన తర్వాత కాలిన వత్తులను ఏం చేయాలి?

image

దీపం వెలిగించిన తర్వాత కాలిన వత్తులను, ఆ బూడిదను పవిత్రంగా భావించాలి. వీటిని ఎప్పుడూ చెత్తబుట్టలో, అపవిత్ర ప్రదేశాలలో పారేయకూడదు. 10 రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజున కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. చివరగా మిగిలిన బూడిదను శుభకార్యాలకు వెళ్లే ముందు తిలకంలా ధరించవచ్చు. మొక్కల మొదట్లో వేస్తే మంచి జరుగుతుంది. వాటిని అపవిత్రం చేయకూడదు.

News February 9, 2026

భద్రాద్రి: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

భద్రాద్రి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారాలతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు.