News November 30, 2025

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

image

TG: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ త్రిముఖ వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. రాష్ట్రస్థాయిలో CM రేవంత్, PCC చీఫ్ మహేశ్, రెండో స్థాయిలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, మూడో స్థాయిలో DCC అధ్యక్షులు పర్యవేక్షించనున్నారు. జిల్లా నేతలతో నిరంతరం ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తూ అత్యధిక పంచాయతీలు గెలిపించే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులపై ఉండగా DCC కొత్త అధ్యక్షులకు ఈ ఎన్నికలు సవాల్ అనే చెప్పాలి.

Similar News

News February 16, 2026

ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

image

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.

News February 16, 2026

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

<>బనారస్<<>> హిందూ యూనివర్సిటీలో 21 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కన్సల్టెంట్, RA, SRF, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PhD(సాయిల్ సైన్స్& అగ్రికల్చర్ కెమిస్ట్రీ, జియోగ్రఫీ), డిప్లొమా జియో ఇన్ఫర్మాటిక్స్, డిగ్రీ, MSc(అగ్రికల్చర్), MA(జియోగ్రఫీ), BSc(అగ్రికల్చర్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bhu.ac.in

News February 16, 2026

TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

image

* నిజామాబాద్ మేయర్‌‌గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్‌గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష(కాంగ్రెస్)