News February 10, 2025
గొల్లప్రోలు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

గొల్లప్రోలుకు చెందిన గంపల జెంబు ఈ నెల 3న చేబ్రోలుకు వంట పనినిమిత్తం వెళ్లి తిరిగి రాత్రి సమయంలో వస్తుండగా గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి బైక్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తలకు గాయమైంది. దీంతో అతడిని కాకినాడలో ఓ ప్రైవేట్ హస్పిటల్‌లో చేర్చారు. అతను చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 17, 2025
TG ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం: TTD

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని TTD నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇవ్వనుండగా, ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పిస్తారు.
News March 17, 2025
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి క్యాన్సర్? నిజమిదే!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు ఆయన టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘మమ్ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. రంజాన్ కావడంతో ఉపవాసం చేస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్స్‌నుంచి విరామం తీసుకున్నారు. ప్రచారంలో ఉన్నది పూర్తిగా అవాస్తవం’ అని స్పష్టం చేసింది. కాగా తన తర్వాతి సినిమాలో మమ్ముట్టి, మోహన్‌లాల్‌తో కలిసి నటించనుండటం విశేషం.
News March 17, 2025
చిత్తూరు జిల్లాలో MROల బదిలీ

చిత్తూరు జిల్లాలో ఏడు మంది MROలను బదిలీ చేస్తూ ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఉత్తర్వులు జారీ చేశారు.
☞ వెదురుకుప్పం MROగా బాబు
☞ గంగవరం MROగా మాధవరాజు
☞ రామకుప్పం MROగా కౌలేష్
☞ పూతలపట్టు MROగా రమేశ్
☞ బైరెడ్డిపల్లి MROగా శ్యాం ప్రసాద్ రెడ్డి
☞ శాంతిపురానికి MROగా ప్రసన్నకుమార్‌ను
☞ గుర్రప్పను చిత్తూరు కలెక్టరేట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.