News March 7, 2025
గోకవరం: కారు ఢీకొని వ్యక్తి మృతి

గోకవరం, కొత్తపల్లి గ్రామంలో పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం కారు – బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ఉన్న జగ్గంపేట మండలం గోవిందపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఇదే ఘటనలో గాయపడిన మహిళను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.
News December 8, 2025
పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

2026 మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు చెల్లించే ఫీజు తేదీల గడువును పెంచినట్లు DEO క్రిష్టప్ప
ఆదివారం తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యం గమనించాలని కోరారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125లు, ఒకేషనల్ విద్యార్థులు ఫీజుతో పాటు అదనంగా రూ.60లు, తక్కువ వయస్సు కోసం రూ.300లు చెల్లించాన్నారు.
News December 8, 2025
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

☛ బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవాలి.
☛ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండాలి.
☛ ఎక్కువగా ఉప్పు కలిపిన ఫుడ్ తీసుకోకూడదు.
☛ రోజూ 2-3లీటర్ల నీరు తాగాలి.
☛ పెయిన్ కిల్లర్స్ అతిగా వాడకూడదు.
☛ ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
☛ తరచుగా కిడ్నీల పనితీరు, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.


