News October 5, 2025

గోదావరిఖనిలో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

image

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ప్రైవేటు విద్యాసంస్థల కార్యనిర్వాహక ఉపాధ్యాయుడు గంటా వెంకటేశ్వర రెడ్డి ఆదివారం మరణించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఆయన ఇంటి పైఅంతస్తు నుంచి కిందికు దూకారు. దీంతో బలమైన గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సందర్భంగా పలువురు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Similar News

News January 18, 2026

నంద్యాల: కనేది మీరే.. చంపేదీ మీరేనా?

image

నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి కన్న పిల్లలను కాస్త కష్టాలకే చంపేసుకోవడం హృదయాలను కదిపేస్తోంది. కనేది మీరే, చంపేదీ మీరేనా? ఏపాపం తెలియని పసికూనలను చంపేముందు ఆలోచించరా? నంద్యాలలో భార్యాభర్తల మధ్య గొడవలతో నిన్న ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఉరేసుకుంది. తుడుములదిన్నెలో తల్లి చనిపోగా పోషణ భారమై ఈనెల 1న ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి చంపేసిన ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

News January 18, 2026

ADB: వేడెక్కనున్న బల్దియా పోరు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీల్లో వార్డులు, ఛైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు శనివారం ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రొటేషన్ పద్ధతిలో స్థానాలను కేటాయించారు. ముఖ్యంగా 50 శాతం స్థానాలు మహిళలకు దక్కడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రిజర్వేషన్లపై ఎట్టకేలకు స్పష్టత రావడంతో ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

News January 18, 2026

నిర్మల్: రేపటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

image

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ చట్టం, అధికారాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బాసర IIIT, నిర్మల్ DMSVK కేంద్రాల్లో జనవరి 19 నుంచి FEB 20 వరకు నాలుగు విడతల్లో ఈ శిక్షణ జరుగుతుంది. కేటాయించిన తేదీల్లో మండలాల వారీగా సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి, పాలనపై ఈ సందర్భంగా అవగాహన కల్పించనున్నారు.