News October 5, 2025

గోదావరిఖని: అధికారులతో సింగరేణి ఆర్జీ-1 జీఎం సమీక్ష

image

సింగరేణి ఆర్జీ 1 జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో జీఎం డీ.లలిత్‌ కుమార్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆర్జీ-1 ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, కార్మికుల సంక్షేమంపై ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉన్నత అధికారులు చంద్రశేఖర్‌, చిలుక శ్రీనివాస్‌, ఎల్‌.రమేశ్, రమేశ్, సాయి ప్రసాద్‌, శివ నారాయణ, రాందాస్‌, వేణు, సాంబశివరావు తదితరులు ఉన్నారు.

Similar News

News January 20, 2026

దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

image

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.

News January 20, 2026

ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

image

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.

News January 20, 2026

శ్రీకాకుళం: జిల్లాలో 57 ఉద్యోగాలకు నేడే లాస్ట్!

image

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈనెల 11నే గడువు ముగియగా 20వ తేదీకి పెంచారు. టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.