News November 6, 2025

గోదావరిఖని: ‘అబ్సెంటిజం సర్క్యూలర్‌పై ఆందోళనలో కార్మిక వర్గం’

image

సింగరేణి యాజమాన్యం అబ్సెంటిజంపై జారీ చేసిన సర్క్యూలర్‌తో కార్మిక వర్గం ఆందోళనకు గురవుతుందని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అబ్సెంటిజం సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, మెడికల్‌ బోర్డు నిర్వహణ త్వరలో చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పోరాటం చేయడం తప్పదని హెచ్చరించారు.

Similar News

News January 18, 2026

20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. FEB 12న పోలింగ్?

image

TG: జనవరి 20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 12న పోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 2027 గోదావరి పుష్కరాలతో పాటు రైతుభరోసాపై మంత్రులు చర్చిస్తున్నారు.

News January 18, 2026

టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.

News January 18, 2026

పొంగులేటి నివాసంలో సీఎం విందు.. అదిరిందన్న రేవంత్!

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మంత్రి ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలతో కూడిన విందును సీఎం ఆస్వాదించారు. “భోజనం అదిరింది” అంటూ మంత్రి కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం పొంగులేటి దంపతులు సీఎంను శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్‌ను జ్ఞాపికగా బహూకరించారు.