News March 7, 2025
గోదావరిఖని: అవమానంతో మహిళ ఆత్మహత్య

గోదావరిఖని రమేష్ నగర్‌కు చెందిన పల్లెర్ల యశోద (65) ను అదే కాలనీకి చెందిన మాశెట్టి కళావతి కోడలు రమ్యశ్రీ ‘ఇసురు రాయి’ విషయంలో నానా బూతులు తిట్టి నెట్టివేశారు.. మనోవేదనకు గురైన యశోద అవమానం భరించలేక ఇంటిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్ టౌన్ SI భూమేష్ తెలిపారు. మృతురాలి కుమారుడు రాజు, భర్త రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 7, 2025
పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ ధర ₹260గా ఉంది. వరంగల్, కామారెడ్డిలోనూ ఇవే రేట్లున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖ, చిత్తూరులో ₹240-260, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ₹220-230 వరకు పలుకుతోంది. ఇక మటన్ కేజీ ₹800-900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు ధర రిటైల్‌లో ఒక్కోటి ₹7-9కి అమ్ముతున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News December 7, 2025
రాష్ట్రంలో 94 పోస్టులు.. రేపటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలో 94 Jr జడ్జీ పోస్టుల భర్తీకి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వీటిలో 66 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, 28 పోస్టులను ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేయనున్నారు. LLB ఉత్తీర్ణతతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకున్నవారు DEC 29వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 23- 35ఏళ్ల మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా వోస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: tshc.gov.in


