News October 4, 2025
గోదావరిఖని: ‘బొగ్గు గనుల అమ్మకాలతో సింగరేణికి ప్రమాదం’

బొగ్గు గనుల అమ్మకాలతో సింగరేణికి ప్రమాదమని జీఎల్‌బీకేఎస్ గౌరవ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్ రావు అన్నారు. గోదావరిఖనిలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నికర లాభాల నుంచి బోనస్ ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులను మోసం చేసిందన్నారు. లాభాలకు సమభాగం పోషించిన కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్‌లో మొండిచేయి చూపించారని మండిపడ్డారు.
Similar News
News January 17, 2026
పెద్దపల్లి: కలెక్టర్ చొరవ.. అనాథ మహిళకు ఆశ్రయం

మానసిక అనారోగ్యంతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అండగా నిలిచారు. తనకు ఎవరూ లేరని, ఆదుకోవాలని ఆమె పెట్టుకున్న అర్జీపై కలెక్టర్ తక్షణమే స్పందించారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లోని ‘అమ్మానాన్న’ అనాథ ఆశ్రమానికి తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత శనివారం వారిని సురక్షితంగా ఆశ్రమానికి చేర్చారు.
News January 17, 2026
నల్గొండ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పాత మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా మారడంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, వసతులు సమకూరుతాయని తెలిపారు.
News January 17, 2026
విశాఖకు రానున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే?

పార్లమెంటరీ రక్షణ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో ఎంపీల బృందం జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా తదితరులు ఉన్నారు. వీరు ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL)లో డీఆర్డీఓ ప్రాజెక్టులను, కోస్ట్ గార్డ్ తీరప్రాంత భద్రతను సమీక్షించనున్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో నగరం అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.


