News August 20, 2025

గోదావరిఖని: మంత్రి, ఎమ్మెల్యేకు రుణ పడి ఉంటాం

image

మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌కు రుణ పడి ఉంటామని రామగుండం ఏరియా లైన్‌ లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కందురు శ్రీనివాసరెడ్డి అన్నారు. గంగానగర్‌లోని సంఘం కార్యాలయంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల లోడింగ్ ను స్థానిక లారీ డ్రైవర్లకు ఇవ్వాలని యాజమాన్యాన్ని మంత్రి, ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారని తెలిపారు. ఇందుకు వారికి లారీ కుటుంబాల తరఫున కృతజ్ఞతలు చెప్పారు.

Similar News

News January 16, 2026

అనంత: మరదలిని సుత్తితో కొట్టి చంపిన బావ

image

హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి శ్రీరామ్‌నగర్‌లో గురువారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. సొంత మరదలిని(17) సుత్తితో కొట్టి బావ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అనంతపురానికి చెందిన పవన్ కుమార్(25)గా గుర్తించారు. హత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీసులు వెల్లడించారు.

News January 16, 2026

₹లక్ష పెట్టుబడికి ₹4 లక్షల రిటర్న్స్!

image

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది. 2019 జులై (సిరీస్-II)లో ₹లక్ష పెట్టిన వారికి నేడు వాటి విలువ ఏకంగా ₹4.15 లక్షలకు చేరింది. RBI ప్రకటించిన తాజా రిడెంప్షన్ ధర ప్రకారం.. గ్రాము బంగారం విలువ ₹14,092గా ఉంది. అంటే ఐదేళ్ల క్రితం ₹3,393కే కొన్న బాండ్లపై ఏకంగా 315% లాభం వచ్చింది. దీనికి అదనంగా ఏటా వచ్చే 2.5% వడ్డీ బోనస్! మీ దగ్గర SGBలున్నాయా? Comment

News January 16, 2026

గార్ల: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని అంకన్నగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెండకట్ల అశోక్(33) అనే రైతు తన సొంత వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో మోటార్ మరమ్మతుల కోసం బావిలో దిగగా ప్రమాదవ శాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. మృతిడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.