News December 1, 2025
గోదావరిలో మునిగి వెంకటపూర్ వ్యక్తి మృతి

మంథని మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన పంచిక సదానందం (44) ఆదివారం ఉదయం గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. బోనాల సందర్భంగా ఆరెంద గ్రామ సమీపంలోని నదికి వెళ్లిన అతడు నీటిలో కొట్టుకుపోయాడు. గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంథని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 16, 2026
PM RAHAT స్కీమ్.. వివరాలివే

రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు కేంద్రం PM RAHAT స్కీమ్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కింద ₹1.5లక్షల వరకు ఉచిత(క్యాష్‌లెస్) చికిత్స అందనుంది. ప్రమాదం జరిగిన 7days వరకు ఇది వర్తిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎమర్జెన్సీ నంబర్(112)కి కాల్ చేస్తే అంబులెన్స్ వచ్చి బాధితుల్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తుంది. ఈ పథకానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
News February 16, 2026
నల్గొండ: ఫలించిన ‘గుమ్మల’ నిరీక్షణ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడు గుమ్ముల మోహన్ రెడ్డి నిరీక్షణ ఫలించింది. గతంలో పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న ఆయన, తాజాగా జరిగిన నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో 13వ వార్డు నుంచి తన సతీమణిని కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. డీసీసీ పదవి దక్కకపోయినా, ఈ గెలుపుతో మంత్రి తన రుణం తీర్చుకున్నారని, తమకు తగిన గౌరవం లభించిందని గుమ్ముల దంపతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
News February 16, 2026
వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలి: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు వేగంగా పూర్తిచేయాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణాల పథకాల అమలుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం పనులను విరివిగా చేపట్టాలని ఆదేశించారు. నిరుపేద కుటుంబాలకు 100 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.


