News September 13, 2025

గోవాడ చెరుకు రైతులకు ‘తీపి’ కబురు లేనట్లేనా?

image

చోడవరం(M) గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరుకు క్రషింగ్ చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఈ సీజన్‌లో క్రషింగ్ సాధ్యం కాదని ఉన్నతాధికారులు తెల్చి చెప్పినట్లు సమాచారం. పొరుగు జిల్లాల్లోని కర్మాగారాలకు చెరుకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఫ్యాక్టరీ మనుగడపై రైతులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Similar News

News December 6, 2025

బాబోయ్.. మాకు తిరుపతి SVU వద్దు!

image

తిరుపతి SVU పరిధిలోని MBA, MCA కాలేజీలు వర్సిటీ నిర్ణయాలతో గగ్గోలు పెడుతున్నాయి. అధిక ఫీజులు, పరిపాలన విధానపరమైన నిర్ణయాలు సరిగా లేకపోవడం, పరీక్షా ఫలితాలు ఆలస్యం తదితర కారణాలతో SVU నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. NOC ఇస్తే అనంతపురం జేఎన్టీయూ తదితర వర్సిటీల నుంచి గుర్తింపు పొందాలని చూస్తున్నాయి. మరి SVU అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? లేక NOCలు ఇస్తారా? వేచి చూడాలి.

News December 6, 2025

దాట్ల జీపీలో 20 ఏళ్లుగా భార్యాభర్తలే సర్పంచ్!

image

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో 20 ఏళ్లుగా కొమ్మినేని రవీందర్-మంజుల దంపతుల కుటుంబమే సర్పంచ్‌ పదవిలో కొనసాగుతోంది. 2001లో రవీందర్ తొలిసారి గెలుపొందగా, ఆ తర్వాత ఆయన వరుసగా రెండు సార్లు, 2013లో మంజుల, 2019లో రవీందర్ గెలిచారు. ఇప్పుడు మళ్లీ మంజుల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

News December 6, 2025

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం కఠిన చర్యలు

image

ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్‌ ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.